ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవొటోబి లకిలకి విస్ఫోటనాలు డేంజర్ జోన్‌ను దాటిపోయాయని అధికారులు ప్రకటించారు. గురువారం నుంచి అగ్నిపర్వతం ప్రతి రోజూ దాదాపు 2 వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతుంది. వేడి బూడిద పడటంతో మంటల్లో పలు నివాసాలు చిక్కుకున్నాయి.