సత్యసాయి: ముదిగుబ్బ మండలం పొడరాళ్ళపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు 35 మేక పిల్లలు మృతి చెందినట్లు యజమాని రాము తెలిపారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆ గ్రామానికి చేరుకొని మేకల కాపరి రైతు రామును పరామర్శించి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.