అన్నమయ్య: కారు ఢీకొని రైతు తీవ్రంగా గాయపడినట్లు నిమ్మనపల్లె ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని సామకోట వారి పల్లెకు చెందిన రైతు కృష్ణయ్య(58) సోమవారం సొంత పనిపై బైకులో నిమ్మనపల్లెకు వస్తుండగా మార్గ మధ్యలో వీరా చెరువు కట్టపై కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతును 108 సిబ్బంది వాణి, అమర వెంటనే పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించారు.