CTR: వర్షాలు విస్తారంగా కురుస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రభలే ప్రమాదముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్ద ఉప్పరపల్లె పీహెచ్సీ వైద్యాధికారి బాలాజీ ఆదివారం సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలన్నారు. ఇళ్ల పరిసరాల్లో మురుగు నీరు ఎక్కువ కాలం నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.