దానా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సింహపురి ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం సికింద్రబాద్ నుంచి వచ్చే(12710) రైలు రద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రబాద్ వెళ్లే(12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు.