మన్యం: భామిని మండలంలో పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శుక్రవారం పర్యటించారు. మండలంలో లివిరి ఆర్.బి రోడ్డు నుంచి రాధాకృష్ణ దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.