KRNL: కల్లూరు మండలం బొల్లవరంలో పొలాల రస్తాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను గ్రామ రైతులు ఆదివారం అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ ఇష్టా రాజ్యాంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నాడని రైతులు త్యాగరాజు, రామేశ్వరి అన్నారు. వాటిని ఏర్పాటు చేయడం వల్ల రైతులు సాగు పనులకు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు తీసుకుకెళ్లడం ఇబ్బంది అవుతుందని తెలిపారు.