ఆముదాలవలస పట్టణ ప్రధాన రహదారిలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. కూన నాగు యూత్ ఆధ్వర్యంలో 16 వినాయక విగ్రహాలను ఒకే చోట ప్రతిష్టించడంతో 16 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 16 వినాయక విగ్రహాలను ఒకేసారి ఊరేగింపుగా నిమజ్జన మహోత్సవానికి తీసుకువెళ్లారు.