KRNL: భగవద్గీత సృష్టిలో అత్యంత ఉన్నతమైన గ్రంథమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకావిష్కరణ చేసి విద్యార్థులకు ఉచితంగా అందించారు. జిల్లా విశ్రాంత సర్వోన్నతాధికారి కుమావత రామశంకర్ నాయక్, జిల్లా విశ్రాంత వైద్యాధికారి డా. పూజారి మోక్షేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.