VZM: విజయనగరం పట్టణంలోని ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని జై భీమ్ రావు పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయని రెవెన్యూ చట్టాలను అనుసరించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.