కోనసీమ: విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోకోఫెడ్ ఛైర్మన్ అరిగెల బలరామమూర్తి అన్నారు. అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సాయిరామ్ అధ్యక్షతన విద్యార్థి వినియోగదారుల క్లబ్ సమావేశం గురువారం జరిగింది. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల హక్కుల పరిరక్షణపై అవగాహణ కలిగి ఉండాలన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు.