VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం ఉదయం 39వ వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చూస్తున్నట్లు తెలిపారు.