కోనసీమ: రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి బయలు దేరి రోడ్డు మార్గంలో ఉదయం 10.20 గంటలకు అమలాపురం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 11.20 గంటల వరకు కూటమి నేతలతో సమావేశమై పట్టభద్రుల ఎన్నికలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చిస్తారు.