VSP: విశాఖ నగరం ఎంవీపీ కాలనీ రీడింగ్ రూమ్ లో గ్రూప్ 2 అభ్యర్థులతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు గురువారం సమావేశం అయ్యారు. గ్రూప్ 2 పరీక్షలకు వారు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా చదవాలో వారికి అవగాహన కల్పించారు. అభ్యర్థులు పట్టుదలతో చదివి విజయం సాధించాలని సూచించారు.