KRNL: మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు సోమవారం నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టాలని కొలిమిగుండ్ల ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని తెలిపారు.