PLD: పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని కుమారుడు యరపతినేని నిఖిల్ పాల్గొని మాట్లాడారు. మండలాల వారీగా బూత్ ఇంఛార్జ్లు గ్రాడ్యుయేట్లను గుర్తించి విరివిగా ఓట్లు నమోదు చేసేలా కృషిచేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.