KRNL: ఆటల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని కర్నూలు తాలూకా సీఐ శ్రీధర్ అన్నారు. శుక్రవారం డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రికెట్ పోటీలను ప్రారంభించి, స్వయంగా బౌలింగ్, బ్యాటింగ్ చేసి యువతలో ఉత్సాహం నింపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఆటల పోటీలు దోహదపడతాయని అన్నారు.