కృష్ణా: ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మాచవరం సీఐ ప్రకాశ్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని బెంజ్ సర్కిల్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న హిజ్రాలకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజల ఇళ్ల మధ్యలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.