అన్నమయ్య ప్రాజెక్టు(annamayya project) డ్యామ్ బాధితులకు అండగా YCP ప్రభుత్వం ఉంటుందని జనసేన్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నెల రోజుల్లో ఇళ్లను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మీ నిబద్ధతను ఎంత వరకు అమలు చేస్తారో చూస్తామని పవన్ అన్నారు.
ఏపీలోని అన్నమయ్య డ్యాం(annamayya project) బాధితుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) రియాక్ట్ అయ్యారు. ఆయా బాధితులకు నెలరోజుల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ చెప్పిన హామీని గుర్తు చేస్తూ ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టే పనులు కంటితుడుపు చర్యగా ఉండబోవని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో ఈ హామీ ఎంత వరకు నెరవేరుస్తారో చూడాలంటే ఇంకో నెల రోజులు ఆగాల్సిందేనని పేర్కొన్నారు. అప్పటివరకు జనసేన పార్టీ వేచి చూస్తుందని చెప్పారు. అంతేకాదు అప్పట్లో వరద బాధితులకు నెలరోజుల లోపే సాయం చేస్తామని ప్రకటించిన వార్త కథనాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ షేర్ చేస్తూ ప్రస్తావించారు.
I hope this is not a knee jerk and eyewash response from YCP Govt to Annamaya Dam Victims. JSP will wait for another one month to see how far you have fulfilled the commitment you have made. వరద బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం | – https://t.co/8D2mHq1JtS
పూర్తికాకుండా ఉన్న ఇళ్ల నిర్మాణాలను నెల రోజుల్లో పూర్తి చేస్తామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష వెల్లడించారు. ఆ తర్వాత గుడారాలలో నివసించే వరద బాధితులకు ఆ ఇళ్లను అందజేస్తామని పేర్కొన్నారు. పలు ప్రభుత్వ అధికారులు అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన క్రమంలో తెలిపారు. పులపుత్తూరు ప్రాంతాన్ని సందర్శించిన క్రమంలో కలెక్టర్ ఈ మేరకు ప్రకటించారు.
దీంతోపాటు వెంటనే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులును ఆదేశించారు. ఆ క్రమంలో బాధితులకు ఇళ్లు ఏర్పాటు చేసే వరకు మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు తెలిపారు.