kidari sarveshwar rao and siveri soma murder culprit arrest
kidari and siveri murder culprit arrest:మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు (kidari sarveshwar rao), సివేరి సోమ (siveri soma) హత్య కేసులో ప్రధాని నిందితుడు, మావోయిస్టు నేత జనుమూరు శ్రీనుబాబు (janumuru srinubabu) అలియాస్ రైనో (raino) అలియాస్ సునీల్ (sunil) పోలీసులకు (police) పట్టుబడ్డాడు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అల్లూరి సీతారామరాజు (alluri sitharama raju) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సునీల్ చిక్కాడని సీలేరు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఐఈడీ (Ied), తుపాకీ (gun), పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఏవోబీ ప్రత్యేక జోన్ డివిజినల్ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఏపీ, ఒడిశా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అని చెప్పారు. రైనోపై గత ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ (siveri soma) హత్య కేసులో 9 మంది (9 people) మావోయిస్టులపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. చార్జ్‌షీట్‌లో మావోయిస్ట్ కళావతి సహా మొత్తం 40 మంది పేర్లు ఉన్నాయి. ఇన్సార్స్ రైఫిల్స్‌తో ఎమ్మెల్యేపై కాల్పులు జరిపి హత్య చేశారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు (kidari sarveshwar rao) అనుచరులతో కలిసి వెళ్తున్న వాహనాన్ని డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్ట వద్ద మావోయిస్టులు అడ్డగించారు. ఆయనను కిందికి దించి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతోపాటు సివేరి సోమ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసును అప్పటి ఏపీ సర్కార్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది.