ప్రకాశం: కంభం మండలంలోని లింగాపురం గ్రామంలో గల ఎంపీపీ పాఠశాలను ఎంపీడీవో వీరభద్రాచారి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో మంచినీటిని టెస్ట్ చేయించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.