SKLM: గుంటూరులో ఈనెల 10వ తేదీన సౌత్ జోన్ కర్ర సాము పోటీలు జరిగాయి. ఇందులో నరసన్నపేటకు చెందిన 10వ తరగతి విద్యార్థి కింజరాపు యుగంధర్ ప్రతిభ చాటాడు. ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. విద్యార్థి నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. పాఠశాల ప్రతినిధులు బోర రామారావు, వెలమల భాస్కరరావు, తర్ర సత్యనారాయణ అభినందించారు.