తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)కు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement scam Case)లో ఏపీ హైకోర్టు బెయిల్ (Bail) మంజూరు చేయడంతో టీడీపీ అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జైలు నుంచి బయటకు రానున్నారు. ఇలా బెయిల్పై బయటకు వస్తున్నారో లేదో ఆయన మరో కేసులో బెయిల్ కోసం హైకోర్టును (High Court) ఆశ్రయించారు. చంద్రబాబుపై మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే దానిపై సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అందులో ఏ3గా బాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది.
చదవండి: Pawan Kalyan: టీడీపీ శ్రేణుల సంబరాలు.. బాబు రాకపై స్పందించిన పవన్ కల్యాణ్
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న కేసులో ఏ1గా నరేష్, ఏ2గా కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబు పేర్లను సీఐడీ నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై పలు అభియోగాలను చేర్చింది. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా సీఐడీ వెల్లడించింది.
చదవండి: Chandrababu: సాయంత్రం బాబు విడుదల.. హైకోర్టు షరతులు ఇవే
ఇప్పటికే చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి. అందులో ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబును చేర్చగా స్కిల్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఆయనకు బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 9వ తేదిన ఆయన్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా 52 రోజుల తర్వాత ఆయనపై మరో కేసును సీఐడీ అధికారులు నమోదు చేయడం సంచలనంగా మారింది.
చదవండి: Rain Alert : వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ చీఫ్ దాఖలు చేసిన ఆ బెయిల్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిందని, మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ పై విచారణ జరగనుందని తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద బాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేేయడంతో టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

