PPM: ఆద్యంతం అద్భుతం.. అమోఘం.. ఉత్కళ నిర్మాణ శైలి అని ఎమ్మెల్యే విజయచంద్ర కొనియాడారు. లోక్సభ, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ ప్రతినిధుల జాతీయ సదస్సులో భాగంగా చారిత్రక, వారసత్వ, ఆధ్యాత్మిక క్షేత్రాలైన లింగరాజ స్వామి ఆలయం, పూరీ జగన్నాథ్ మందిరం, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఆయన సహచర సభ్యులతో కలిసి సందర్శించారు.