SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఇవాళ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కొరత, దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.