NTR: మొగల్రాజపురంలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మొగల్రాజుపురానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి, ఆడుకుంటున్న ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కుటుంబ సభ్యులు గమనించడంతో పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.