CTR: జిల్లాలో కుప్పంలోని కమ్మత్మూరు, చిత్తూరు నగరం కాజూరులోని శంకరయ్యగుంటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల భవన నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘ నిధులు రూ. 2 కోట్లు మంజూరు చేస్తూ వైద్యారోగ్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 యూపీ హెచ్సీల భవనాల నిర్మాణాలకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి.