తూ.గో: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారని, ఆ బియ్యాన్ని వ్యాపారస్తులకు అమ్మవద్దని గోకవరం డీటీ రత్నాకర అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 45 రేషన్ షాపుల ద్వారా అర్హులైన వారందరూ బియ్యం తీసుకుంటున్నారని, చాలామంది అమ్ముకుంటున్నారని అన్నారు.