ATP: ఎప్పుడు ఖాకీ దుస్తుల్లో ఉండే పోలీసులు పట్టు పంచలు కడితే అదే కదా అసలు పండగంటే. సంక్రాంతి సంబరాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసులు సాంప్రదాయ దుస్తులు ధరించి, పండగ సంబరాలు ఘనంగా చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ జగదీష్ పట్టు పంచె కట్టి సరదాగా ఎడ్లబండ్లను నడిపారు. అలాగే, జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.