అనంతపురం జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతకు హెవీ మోటార్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముదా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల వయసు దాటిన యువతీ,యువకులు ఈ నెల 27లోపు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 40 ఏళ్లు దాటితే మెడికల్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుందన్నారు.