KKD: కాకినాడ రూరల్‌కు చెందిన జమ్మలమడక నాగమణిని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆమె గోదావరి జిల్లాల మహిళా విభాగం కో-ఆర్డినేటర్‌గా పని చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నాగమణి తెలిపారు.