CTR: స్వర్ణాంధ్రా, స్వచ్ఛాంధ్రలో భాగంగా చౌడేపల్లె మండలంలోని ఆరు పంచాయతీలకు తోపుడు బండ్లు మంజూరయ్యాయి. వీటిని ఆయా పంచాయతీలకు ఎంపీడీవో లీలా మాధవి అందజేశారు. గ్రీన్ అంబాసిడర్లు తోపుడు బండ్లను ఉపయోగించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర దిశగా గ్రామీణ ప్రాంతాలు పయనించేలా అందరూ కృషి చేయాలని కోరారు.