KRNL: కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల (ట్రయల్ రన్ ) రీహర్సల్‌ను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. రేపటి నుండి కర్నూలు ఏపిఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో జరిగే పీఎంటీ, పీఈటీ పరీక్షల నేపథ్యంలో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది, కొంతమంది యువకులతో ఎస్పీ ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్‌ను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.