NTR: యువతిని నమ్మించి వంచన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన యువతికి (25) ఓ డేటింగ్ యాప్‌లో అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ మంగళవారం కలుసుకున్నారు. యువతిని హోటల్ రూమ్‌కు తీసుకువెళ్లిన సదరు వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు.