కృష్ణా: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పెడన మండలం నేలకొండపల్లి గ్రామంలో శుక్రవారం స్వామిత్వ సర్వేను పరిశీలించారు. అధికారులు సర్వే ప్రగతిని వివరించగా, కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. ప్రజలకు ఖచ్చితమైన హక్కుల రికార్డులు అందేలా సర్వేను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు.