కృష్ణా: ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పాత్రికేయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ అధికారి హేలా షారోన్ మంగళవారం ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. పాత్రికేయులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, అధికారులు పాల్గొన్నారు.