CTR: పుంగనూరు భవన నిర్మాణ కార్మికుల సంఘ నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికయింది. పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తోరం రాజా సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా కేశవరెడ్డి, కార్యదర్శిగా సురేంద్ర, కోశాధికారిగా ఆకుల భాస్కర్ వీరితో పార్టీ మరో 35 మంది సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.