CTR: అపోలో యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ విభాగం శుక్రవారం వరల్డ్ ట్రామా డే ఘనంగా నిర్వహించింది. “ఎంపవర్, ఎడ్యుకేట్, ఎరాడికేట్ ట్రామా” అనే థీమ్‌లో, ట్రామా పరిస్థితుల్లో తక్షణ స్పందన, గాయాల నిర్వహణ, ప్రాణరక్షణ చర్యల ప్రాముఖ్యతపై విద్యార్థులు, నిపుణులు అవగాహన పెంపొందించారు.