KDP: ప్రభుత్వ చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఆటోను, అందులోని 500 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కడప టూ టౌన్ సీఐ జి. ప్రసాద రావు తెలిపారు. సమాచారం రావడంతో ఉక్కాయపల్లి వైపు నుంచి వస్తున్న ఆటోలో 50 కిలోల బరువున్న 10 బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.