ELR: కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉన్నహోమియో వైద్యశాల మార్పునకు తీర్మానం చేసినట్లు డాక్టర్ రఫీయా పర్వీన్ తెలిపారు. తడికలపూడి సొసైటీ ఆవరణలో ఉన్న ఈ ఆసుపత్రిని గతంలో బందెలదొడ్డిగా ఉండే స్థలంలో రూ. 30 లక్షలతో నిర్మించడానికి తీర్మానం చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణానికి సహకరించిన సొసైటీ సభ్యులుకి, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.