ATP: కళ్యాణదుర్గంలో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీవో భవనాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఉద్యోగులు శాలువాతో సత్కరించారు.