VZM: విద్యారంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని SFI నాయకులు విమర్శించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బొబ్బిలి MRO కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా SFI నాయకులు చినబాబు, మణికుమార్, శివ మాట్లాడుతూ.. తల్లికి వందనం 60% మందికి మాత్రమే ఇచ్చారని, అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.