విశాఖలోని శిల్పారామం మధురవాడలో “ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా–2026”ను జనవరి 8 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు సీఈవో స్వామినాయుడు తెలిపారు. వివిధ రాష్ట్రాల శిల్పులు తమ హస్తకళ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. జనవరి 8న సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మేళాను ప్రారంభిస్తారన్నారు.