EG: రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం రాత్రి 55,862 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవల కు 7,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.