ప్రకాశం: సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం మార్కాపురంలోని 31వ వార్డు రాజ్యలక్ష్మి కాలనీలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.