గుంటూరు: జిల్లా జైలులో ఖైదీలకు వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీనివాసరావు, షిప్ అధ్యక్షులు రమాదేవి, సమన్వయకర్త రవి మాట్లాడుతూ.. టీవీ, హైపర్టైటిస్, హెచ్ఐవీ, సిపిలిస్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఆయా వ్యాధులు సంక్రమించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేశారు.