VZM: విజయవాడ వరద బాధితుల సహాయార్థం మండలంలోని పాంచాలి ఉన్నత పాఠశాల విద్యార్థులు విరాళాలు సోమవారం అందజేశారు. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు రూ.7వేల నగదును మంత్రి గుమ్మడి సంధ్యారాణికు అందజేశారు. సామాజిక బాధ్యతతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావడం అభినందననీయమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.