SKLM: నరసన్నపేట మండలం బొరిగివలస గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సునీత ఆధ్వర్యంలో రైతులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి సాగులో సుడిదోమ వ్యాపిస్తున్నందువలన వాటిని నివారణపై తగు సూచనలు చేశారు. సుడిదోమ ఉదృతిని గుర్తించి క్రిమిసంహారక మందులను వాడవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.