ELR: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7న జరగాల్సిన జాబ్ మేళా ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఇన్ఛార్జ్ అధికారి వాడపల్లి కిషోర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు గమనించాలని కోరారు.