ASR: అరకు మండలం మాదల పంచాయతీ దాబుగూడ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి ఆదివారం డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న మైనింగ్ తవ్వకాల వల్ల చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని అన్నారు.